NLR: మనుబోలులో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కొలనకుదురు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు బైక్పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులుఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.