NLR: వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం మల్లాం నుంచి చిన్న తోటకు బయలుదేరిన బస్సు మార్గమధ్యంలో అమాంతంగా పొలాల్లోకి దూసుకెళ్లింది. త్రుటిలో ప్రమాదం తప్పగా బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.