కృష్ణ: కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా విజ్ఞప్తి చేసింది. కృష్ణా నదికి వరద ప్రవాహం స్వల్పంగా పెరగడంతో ప్రకాశం బ్యారేజి వద్ద 2.06లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొంది. కాగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజి నుంచి విడుదల చేస్తున్నారు.