NDL: ఆళ్లగడ్డలోని వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం భవనం పైకప్పు పెచ్చులూడి పడటంతో సెకండియర్ చదువుతున్న శ్వేత తీవ్రంగా గాయపడింది. ఉదయం విద్యార్థులు స్టడీ అవర్లో ఉండగా.. భవనం పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గాయాలపాలైన శ్వేతను తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.