ప్రకాశం: చీరాల మండలం విజయనగర్ కాలనీ పంచాయతీ వాసులు విజయవాడ వరద బాధితుల సహాయర్థం గ్రామ పెద్దలు, గ్రామస్థులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1,17,000 చెక్కును శనివారం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు అందజేశారు. ఒక్కతాటి పైకి వచ్చి వరద బాధితులకు సహాయం చేసిన గ్రామస్థులకు గ్రామ పెద్దలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.