తిరుపతి: సూళ్లూరుపేట సబ్ స్టేషన్ వద్ద 100ఎంవీఏ 200/132 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ ఫిల్ట రేషన్ ప్రక్రియ చేస్తున్నందున వ్యవసాయ విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వలేమని ఈఈ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం నుంచి నవంబర్ 2వ తేదీ వరకు సబ్స్టేషన్ పరిధిలో వ్యవసాయానికి షెడ్యూల్ ప్రకారం కాకుండా రాత్రి సమయాల్లోనూ విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు.