కృష్ణా: మండలంలోని ఘంటసాల పాలెం, ఘోటకం మాలపల్లిలో గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన సుదర్శన్-లావణ్య దంపతుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంటిలోని వస్తువులు, బీరువా, మంచం, పుస్తకాలు, ఇతర సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.