కృష్ణా: ముసునూరు మండలం వలసపల్లిలో తమ్మిలేరు వాగుపై ఇసుక రీచ్‌ను మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాలలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.