కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య కళ్యాణం రాత్రి సమయంలో జరగడం విశేషం. ఇతర జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. రాత్రి సమయంలో రవాణా సదుపాయం లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఉచిత ఆటో సౌకర్యం ఏర్పాటు చేశామని ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు.