SRPT: తిరుమలగిరి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్వో కోట చలం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు దస్త్రాలను పరిశీలించారు.. ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలను పరిశీలించారు విధులకు హాజరుకాని ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.