ASR: గిరిజన ప్రాంతంలో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి కోరారు. గురువారం జెడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో ఎంపీయూపీ పాఠశాలలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసి, విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలన్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన గిరిజనులను ఆదుకోవాలని కోరారు.