ASR: కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనులకు మంజూరు చేసిన పీఎం జన్ మన్ ఇళ్లకు రూ.5 లక్షల అంచనా విలువ పెంచాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం అరకులోయ మండలంలోని బొండాం పంచాయతీ పరిధిలోని రేగ గ్రామంలో పర్యటించారు. పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్లకు అంచనా విలువ పెంచాలని కోరారు.