కోనసీమ: కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆయన ఆదివారం కొత్తపేట మండలంలోని కండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించునున్న సీసీ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు గంగాధరం, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.