»Heavy Rain In Telugu States Storms And Thunderstorms
Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం…ఈదురుగాలులు, పిడుగుల బీభత్సం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిశాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.
తెలుగు రాష్ట్రల్లో గత మూడు రోజులు నుంచి భారీ వర్షాలు (Heavy rains) పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ సూచించింది.ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లోగంటకు 30 నుంచి 40 కీలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక ఈ అకాల వర్షాల నేపథ్యంలో రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుందంట. ముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల(Tirumala)లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా తిరుమాడ వీధులు (Streets of Tirumada) జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహించింది. పలు షాపింగ్ కాంప్లెక్స్ లలోకి నీరు ప్రవేశించింది. భక్తులు షెడ్ల కింద తల దాచుకోవాల్సి వచ్చింది.
తొలుత మధ్యాహ్నం 2 గంటల సమయంలో వర్షం పడింది. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల సమయంలో వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు భక్తులు ఇబ్బందిపడ్డారు. ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా(Krishna District)లో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(Prattipadu)మండలంలో ఇద్దరు రైతులు (Farmers) పిడుగుపడి మృతి చెందారు. కల్లంలోని మిర్చి పంటపై పట్టలు కప్పుతుండగా పిడుగు పడడంతో శ్యాంబాబు, కృపాదానం అనే రైతులు మృత్యువాతపడ్డారు. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. వరి, మిర్చి పంటల్ని కాపాడుకొనేందుకు రైతులు హైరానా పడుతున్నారు. ఈదురు గాలుల బలంగా వీస్తుండటంతో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ఉన్న కొద్దిపాటి పంటను అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు పంట(crop)ను దెబ్బతీస్తాయని ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతాంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.