NTR: నకిలీ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఎక్సైజ్ కోర్టు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ఏ2 జగన్మోహన్రావు, ఏ18 జోగి రమేష్, ఏ19 జోగి రాము దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అయితే కొంతమంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. జోగి రమేష్, జోగి రాము సహా 13 మందికి ఈనెల 31 వరకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.