తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. తాజాగా నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సర్వ దర్శనం క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి 21 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
అలాగే రూ.300ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు గల వారికి మూడు గంటల సేపు శ్రీవారం దర్శనానికి సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 74,229 మంది దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని, అందులో 31,381 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.47 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.