KRNL: కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ క్రాంతి నాయుడు నియమితులయ్యారు. ఏపీలోని జిల్లా డీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగినట్లు క్రాంతి నాయుడు పేర్కొన్నారు.