విజయనగరం అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న మదర్ తెరిసా కిడ్స్ స్కూల్లో ఏపీ గ్రంథాలయ ఉద్యమ రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధులు, కీ.శే పాతూరి నాగభూషణం జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ సేవా సంఘం పట్టణశాఖ కన్వినర్ త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు, విద్యార్థులు నాగభూషణం చిత్ర పటానికి పూలుమాలలు వేసి నివాళులర్పించారు.