NLR: అల్లూరు మండలంలోని అన్ని పంచాయతీల్లో శానిటేషన్పై ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రజనీకాంత్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. వర్మీ కంపోస్ట్, చెత్త నుంచి సంపద తయారీ చేయడం, తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేయడం, తదితర అంశాలను ఈ గ్రామసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.