సత్యసాయి: పెనుకొండలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో మాల నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్ మూర్తి మాట్లాడుతూ.. ఈనెల 23న వర్గీకరణకు వ్యతిరేకంగా రాయలసీమ జిల్లాల మాలలతో నిర్వహించు మాలల మహా సింహ గర్జన సభకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. మాలల మహా సింహ గర్జన సభకు జిల్లా నుండి మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు.