W.G: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం భీమవరం డిపో గ్యారేజీలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వై. వేణు మాట్లాడుతూ.. బస్ స్టేషన్ ఆవరణలో 5 కిలోమీటర్ల వేగం మించరాదని, మలుపుల వద్ద ఓవర్ టేక్ చేయవద్దని సూచించారు. డ్రైవర్లు విధి నిర్వహణలో ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని, అప్రమత్తంగా ఉండి సంస్థకు ఆదరణ పెంచాలని కోరారు.