CTR: చిత్తూరు ఓబనపల్లి కాలనీలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం మొదటి వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.