NLR: గ్రామస్తులు త్రాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నా ఘటన కొండాపురం మండలం బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామానికి సరఫరా చేసే త్రాగునీటి మోటర్లు మరమ్మత్తులకు గురయ్యాయి. ఈ విషయం అధికారులకు తెలిపినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదు. గ్రామాల్లోని ప్రజలు నీళ్లు కోసం గంటలు తరబడి వేచి ఉంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.