GNTR: పెదకాకాని మండలంలో గంజాయి విక్రయదారుల గుట్టురట్టు చేసిన సీఐ నారాయణస్వామి, సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ కేసులో 14 మంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.95 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచినందుకు గాను ఆదివారం సీఐతో పాటు ఎస్సైలు మీరజ్, రామకృష్ణలకు ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు.