ASR: జీకేవీధి మీదుగా తిరిగే వాహనాల డ్రైవర్లు లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని సీఐ సుధాకర్ హెచ్చరించారు. గురువారం రాత్రి జీకేవీధిలో పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల యజమానులకు, డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రాత్రిపూట ప్రయాణాలు తగ్గించాలని సూచించారు.