BPT: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా బాపట్ల పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల రవాణా శాఖ అధికారి రంగారావు మాట్లాడుతూ.. వాహన దారులు తగిన భద్రతా ప్రమాణాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పారు. ద్విచక్రవాహన దారులు హెల్మెట్లు ధరించాలని సూచించారు.