GNTR: అభివృద్ధి పనులు నిర్వహించిన అనంతరం నిర్మాణ వ్యర్ధాలను సంబంధిత కాంట్రాక్టర్ వెంటనే తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కమిషనర్ పెదపలకలూరు, రత్నగిరి కాలని, అరండల్ పేట తదితర ప్రాంతాలలో పర్యటించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని చెప్పారు. పనులు జరిగే సమయంలో కార్యదర్శులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలన్నారు.