ప్రకాశం: బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు, కష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులతో బాల్యవివాహలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.