ATP: తాడిపత్రిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 11వ రోజు సందర్భంగా దేవాలయం దీపకాంతుల్లో శోభిల్లింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు. పెన్నా నది తీరాన కొలువై ఉన్న రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.