ప్రకాశం: ఫేక్ లోన్ యాప్ల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్ అంటే ఆశపడవద్దన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్లలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మవద్దన్నారు. డేటాను సైబర్ మోసగాళ్ల చేతిలో పెట్టవద్దన్నారు. ఈజీగా లోన్ వస్తుందని చిక్కుల్లో పడవద్దని హెచ్చరించారు.