ప్రకాశం: మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదివారం పట్టణంలోని 1 వ వార్డులో రాధాకృష్ణ టాకీస్ వెనుక భాగంలో 8 లక్షల వ్యయంతో CC రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం 35వ వార్డులోని అరవింద్ స్కూల్ ప్రక్క వీధిలో 12 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి అన్ని విధాల కూటమి ప్రభుత్వసహాయ సహకారం అందిస్తుందని తెలిపారు.