ELR: కోడిపందాలు నిర్వహించడం నేరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం కోడిపందాల నిషేధ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సమయంలో జిల్లాలో చట్టవిరుద్ధమైన కోడిపందాలను నిషేధించడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.