KDP: పులివెందుల మండలం నల్లగొండువారిపల్లెలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం భాగవత సప్తాహ పఠనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భాగవత పండితులు భగవద్గీత సారాంశం, భగవద్గీత శ్లోకాలు, భగవద్గీత అధ్యాయాల గురించి తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు భగవద్గీత చదవడంవల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.