కృష్ణా: మల్లాయపాలెం రైల్వే గేట్ ఎస్సై చంటిబాబు ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనదారులను అల్కోమీటర్ ద్వారా పరీక్షించగా, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై మోటార్ వాహన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు.