కడప నగరంలోని గడ్డి బజార్లో వెలసిన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సందర్శించారు. దేవీ నవరాత్రి వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు విజయ్ బట్టర్ వారికి స్వాగతం పలికారు.