ప్రకాశం: కందుకూరు పట్టణంలోని రెవెన్యూ ఆఫీసులో పెట్రోల్ బంకు నిలుపుదల చేయాలని కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. మేరకు గురువారం కందుకూరు మండల తహసీల్దార్‌కు వారు వినతి పత్రం అందజేశారు. కందుకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్ బంకు పెట్టడానికి వీలు లేదని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.