KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినిమా దర్శకుడు తేజ, టీడీపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్క రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంచాలమ్మ దేవి, మూల బృందావనంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.