విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం రాత్రి చైతన్య నగర్ ప్రాంతంలో కోడి పందేలు జరుగుతున్నట్లు సమాచారం మేరకు సీఐ అప్పలనాయుడు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4 పందెం కోళ్లు ,రూ. 5,180 స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని ఎంవీపీ పోలీస్ వారికి అప్పగించారు.