CTR: చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో 22 మంది రౌడీ షీటర్లకు సీఐ జయరామయ్య కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచామన్నారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా వాళ్లకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. అల్లర్లు సృష్టించినా, శాంతి విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.