ASR: అనంతగిరి మండలం మంగళగుడ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని గ్రామస్తుడు సింహాచలం కోరారు. ఈ మేరకు గురువారం మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నామని ఆవేదన చెందారు. రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారని తహసీల్దార్‌కు తెలిపారు.