VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానంలో రామచంద్ర ప్రభువుకి శనివారం ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. వెండి మండపంలోని ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. అలాగే యాగశాలలో హోమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో వై శ్రీనివాసరావు పర్యవేక్షించారు.