VSP: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఎంవీవీతో పాటు ఆయన స్నేహితుడు ఆడిటర్ వెంకటేశ్వరరావు, మరో వ్యక్తి బ్రహ్మాజీ నివాసాలు కార్యాలయాలపై ఐదు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. భూ కబ్జా కేసుకు సంబంధించి వీరిపై ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దాడులు చేస్తున్నారు.