SKLM: బూర్జ మండలం T.R రాజుపేట గ్రామంలో శనివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేసినట్లు కొల్లివలస పశువైద్యాధికారి జి. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాదరావు సమక్షంలో నిర్వహించారు. గొర్రెలు, మేకల ఆరోగ్యంపై పెంపకదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.