కర్నూలు: పెద్దకడబూరు మండలం కల్లుకుంటకు చెందిన దళిత మహిళ గోవిందమ్మ తనకు న్యాయం చేయాలని ఎమ్మిగనూరులో చేపట్టిన నిరాహార దీక్ష గురువారం రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నారనే కుట్రతో గోవిందమ్మపై విచక్షణారహితంగా దాడి చేశారని, దాడికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.