ప్రకాశం: కారంచేడు గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య తీరనుంది. రూ. 75 లక్షల వ్యయంతో ఓఎన్జీసీ సీఎస్ఆర్ ఫండ్స్‌తో చెరువు వద్ద నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీరు గృహాలకు సరఫరా కానుంది. ఈ ప్లాంట్‌ను మంత్రి రవికుమార్, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, ప్రారంభించనున్నారు.