గుంటూరు: ఉపాధి కార్యాలయం, సమర్థనం సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. రమాదేవి తెలిపారు. 24న ఉదయం హిందూ కళాశాలలో మేళా జరుగుతుందని, ఆసక్తి కలిగిన యువత విద్యార్హత పత్రాలతో పాల్గొనవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు 0863 2350060 నంబర్ ను సంప్రదించవచ్చన్నారు.