GNTR: వర్షం వల్ల ఉండవల్లి, తాడేపల్లి పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆలీం భాషా వెంటనే స్పందించి రెండు ప్రాంతాల్లో ఆయిల్ ఇంజను ఏర్పటు చేసి కచ్చ కాలువలు తవ్వించి వర్షపు నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకున్నారు. కమిషనర్ చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.