ATP: గార్లదిన్నె మండలంలో సోమవారం ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించనున్నట్లు వారి కార్యాలయం నుండి తెలిపారు. ఉదయం 10 గంటలకు మిడ్ పెన్నర్ రిజర్వాయర్ వద్ద పూజలు నిర్వహించి, కెనాల్‌కు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గార్లదిన్నెలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.