ప్రకాశం: కనిగిరి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న పాలపర్తి జాన్ ఇర్ఫాన్ బదిలీ అయ్యారు. ఆయనను కడప ఆర్డీవోగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన ఆర్డీవో ఇర్బాన్ స్థానంలో అమలాపురంలో ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న కేశవర్ధన్ రెడ్డిని కనిగిరి ఆర్టీవోగా నియమించారు. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.