తూ.గో: ఏలేశ్వరం నగర పంచాయతీ నూతన కమిషనర్గా ఎం సత్యనారాయణ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. సత్యనారాయణ అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుండి ఏలేశ్వరం బదిలీపై వచ్చారు. ప్రస్తుత కమిషనర్గా ఉన్న కేశవ ప్రసాద్ విశాఖ జోనల్ కమిషనర్గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి కృషి చేస్తానన్నారు.